న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ భారత్‌లో స్టార్‌లింక్ పేరిట శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. లైసెన్స్ కోసం గత వారమే టెలికం సంస్థకు స్పేస్ ఎక్స్ దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.
వాస్తవానికి భారత్‌లో ఇంటర్నెట్ సేవలకు స్పేస్ఎక్స్ గత ఏడాదే ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించింది. అయితే దీనిపై టెలికం శాఖ హెచ్చరిక జారీచేయడంతో వాటిని నిలిపివేసింది. రెగ్యులేటరీ అనుమతి ఇంకా రానందువల్ల సర్వీసులు ఇంకా అందుబాటులోకి తేవడం లేదని తమ వెబ్సైట్లో పేర్కొన్నది. తాజాగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నది.