న్యూఢిల్లీ : టెస్లా, ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మధ్య ఎక్స్ వేదికగా జరిగిన వాడివేడి చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఓపెన్ఏఐకి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జీపీటీ-5 ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్‌లో అందుబాటులో ఉందని సత్య నాదెళ్ల గురువారం ప్రకటించారు. తాజా వెర్షన్‌తో డెవలపర్స్, ఎంటర్ప్రైజెస్, వినియోగదారులు ఏమేం చేయబోతున్నారో చూడటానికి వేచి ఉండలేకపోతున్నానన్నారు.
ఓపెన్ఏఐని తీవ్రంగా విమర్శించే ఎలాన్ మస్క్ స్పందిస్తూ, “మైక్రోసాఫ్ట్‌ని ఓపెన్ఏఐ సజీవంగా మింగేస్తుంది” అని అన్నారు. అంటే, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ ప్రాభవాన్ని మరుగుపరుస్తుందని మస్క్ భావిస్తున్నట్లు చెప్పవచ్చు. మస్క్ వ్యాఖ్యలపై సత్య నాదెళ్ల స్పందించారు. ‘’50 ఏళ్ల నుంచి జనం ప్రయత్నిస్తున్నారు, అదే ప్రహసనం! ప్రతి రోజూ ఏదో కొత్తదాన్ని నేర్చుకో, కొత్తదాన్ని కనిపెట్టు, భాగస్వామిగా మారు, పోటీ పడు. గ్రోక్ 4 రాకకోసం, గ్రోక్ 5 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు.