న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఈ ఏడాది టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా స్పేస్ఎక్స్, టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ఎంపికయ్యారు. ‘సొంత ఇల్లు లేని, ఇటీవలి కాలంలో తన ఆస్తులను అమ్ముకొంటున్న ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు’గా టైమ్ మ్యాగజీన్ మస్క్‌ను అభివర్ణించింది. ‘ఉపగ్రహాలను పంపిస్తాడు. వేలి కొనలతో స్టాక్ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తాడు. పాతాళానికి పడేస్తాడు.అంగారక గ్రహాన్ని ఏలాలని కలలు కంటాడు’ అని పేర్కొన్నది.