న్యూఢిల్లీ : అరటిపండు తినిపించేందుకు వచ్చిన యువతిపై ఏనుగు దాడి చేసిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేసిన ఈ వీడియోలో ఏనుగుకు అరటిపండు తినిపించేందుకు యువతి ప్రయత్నిస్తుండటం కనిపిస్తుంది. ఆపై వీడియో కొనసాగుతుండగా యువతిని తన తొండంతో ఏనుగు తోసివేయడం చూడొచ్చు.
You can’t fool an elephant even though he is tamed. They are one of the most intelligent animals to be in captivity. pic.twitter.com/rQXS6KYskN
— Susanta Nanda (@susantananda3) April 27, 2023
ఈ వీడియో అక్కడితో ముగియడంతో ఏనుగు దాడిలో యువతికి ఏమైనా గాయాలు అయ్యాయా అనే వివరాలు వెల్లడికాలేదు. ఏనుగును మీరు మచ్చిక చేసుకున్నా దాన్ని ఫూల్‌ను చేయలేదు..అత్యంత తెలివితేటలు కలిగిన జంతువుల్లో ఇవి ముందువరుసలో ఉంటాయని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఇక కామెంట్స్ సెక్షన్లో మహిళ భద్రతపై పలువురు యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
కొందరు యూజర్లు గతంలో జరిగిన ఈ తరహా ఘటనల వీడియోలను షేర్ చేశారు. ఓసారి తాను కజిన్‌తో కలిసి పిల్ల ఏనుగుకు ఆహారం అందించేందుకు వెళ్లగా అది తొండంతో కొట్టడంతో తన కజిన్ కొన్ని గజాల దూరంలో వెళ్లి పడ్డాడని ఓ యూజర్ గుర్తుచేసుకున్నారు. ఇక ఏనుగు తొండం శక్తివంతమైందని, వాటితో ఎన్నడూ తలపడకూడదని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More