న్యూఢిల్లీ : గత ఎన్నికల నాటి ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలు, వ్యక్తులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం విమర్శలు గుప్పించింది. ఆ ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు తెలిపే గడువు ఏనాడో తీరిపోయిందని తెలిపింది.
ప్రతి దశలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసుకుంటూ పారదర్శకంగా బహుళ దశల్లో సాగించే ప్రక్రియగా ఓటర్ల జాబితా తయారీని ఈసీ అభివర్ణించింది. నిర్దిష్ట గడువు సమయంలోనే అభ్యంతరాలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావలసి ఉంటుందని 10 అంశాలతో కూడిన ప్రకటనలో ఈసీ స్పష్టం చేసింది. అటువంటి అభ్యంతరాల్లో నిజముంటే ఎన్నికల ముందే వాటిని సరిచేస్తారని ఈసీ తెలిపింది.