Electoral Bonds | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్ eci.gov.inలో అందుబాటులోకి తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బాండ్ల వివరాలను ఈసీ పబ్లిష్ చేసింది. 763 పేజీల్లోని ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ బహిరంగ పరిచింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎవరు ఎన్ని బాండ్లు ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలను వెల్లడించింది. ఎస్బీఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతధంగా ఈసీ వెబ్సైట్లో పెట్టింది. రూ.891 విలువైన ఎలక్టోరల్ బాండ్లను మేఘా సంస్థ కొనుగోలు చేసింది.