న్యూఢిల్లీ, నవంబర్ 4: త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎలక్టోరల్ బాండ్లను ఈ నెల 6 నుంచి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఎస్బీఐకి చెందిన 29 బ్రాంచీల్లో ఈ నెల 20 వరకు ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లు తెచ్చుకున్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఈ ఎలక్టోరల్ బాండ్లు స్వీకరించడానికి అర్హత పొందుతాయి.