న్యూఢిల్లీ, జూన్ 27: పది రాజ్యసభ సీట్లకు జూలై 24న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జూలై 28-ఆగస్టు 18 మధ్య పార్లమెంట్ ఎగువసభలోని 10 మంది సభ్యుల పదవీ కాలం ముగియనున్నది. దీంతో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లకు జూలై 24న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన జారీచేసింది. సభ్యుల ఆరేండ్ల పదవీకాలం ముగియటంతో గోవాలో ఒకటి, గుజరాత్లోని నాలుగు, పశ్చిమ బెంగాల్లోని ఐదు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, టీఎంసీ నాయకుడు డెరిక్ ఓబ్రియన్ పదవీకాలం పూర్తిచేసుకోనున్నవారిలో ఉన్నారు.