ఆదివారం 12 జూలై 2020
National - Jun 02, 2020 , 05:28:46

19వ తేదీన 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

19వ తేదీన 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం ప్రకటించింది. వీటిలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానాలు 18 ఉండగా.. మిగిలిన ఆరు స్థానాలు తాజాగా ఖాళీ అయ్యాయి. వీటన్నింటికి కలిపి ఎన్నికలు జరుగనున్నాయి. వాస్తవానికి మార్చి 26న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. కాగా, 55 స్థానాలకు 37 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాల నుంచి నాలుగు చొప్పున, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల నుంచి మూడు స్థానాల చొప్పున, జార్ఖండ్‌ నుంచి రెండు, మణిపూర్‌, మేఘాలయల్లో ఒక్కో స్థానానికి తాజాగా ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు  కర్ణాటక (4), అరుణాచల్‌ప్రదేశ్‌ (1), మిజోరం (1)లలోని ఆరు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.   


logo