లక్నో: ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బలంతో ఎన్నికలు గెలువలేదని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఉన్న విభేదాలను మరోసారి ఇలా బయటపెట్టారు. సోమవారం పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, యూపీలోని ఆ పార్టీ ప్రభుత్వం మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టం చేశారు. ‘వర్తమానం, భవిష్యత్తు బీజేపీదే. ఈసారి (లోక్‌సభ ఎన్నికల్లో) మనం అంతగా రాణించలేకపోవచ్చు. కానీ వచ్చేసారి మరింత బలంతో తిరిగి వస్తాం. మనం మరింతగా కష్టపడాల్సి ఉంది. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసంలో చిక్కుకుపోయాం. ప్రభుత్వ బలంతో ఎన్నికల్లో గెలువలేదని నేను చెబుతున్నా. ఎన్నికల్లో పోటీ చేసేది పార్టీనే, గెలిచేది పార్టీనే. అందుకే 2027లో మనం మరింత బలపడాలి’ అని ఆయన అన్నారు.
కాగా, సీఎం ఆదిత్యనాథ్‌తో విభేదాలున్న కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ నెల 17న కూడా వివాదస్పద ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వం కంటే పార్టీ పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు. కార్యకర్తల బాధ నా బాధే. కార్యకర్తలే గర్వకారణం’ అని డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
#WATCH | Lucknow: Uttar Pradesh Deputy CM Keshav Prasad Maurya says, "BJP is the present and the future….This time (in Lok Sabha elections) we might have missed but next time we will come back stronger…The hard work we should have done, we missed because we got caught up in… pic.twitter.com/yUgkwYiOKU
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 29, 2024