న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొన్నది. ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం సమావేశం కానుంది. ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై ఆరా తీయనున్నది.