న్యూఢిల్లీ, మే 22 : పది రాష్ర్టాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్(ఈసీ) శుక్రవారం ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న రాజ్యసభ సభ్యుల్లో మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జి కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో నాలుగు స్థానాల చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మూడేసి స్థానాలు, జార్ఖండ్లో రెండు స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో ఒక స్థానం చొప్పున వచ్చే నెలలో ఖాళీ కానున్నాయి.
జూన్ 1న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. జూన్ 18న పోలి ంగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మహారాష్ట్ర, తమిళనాడులోని ఒక్కో స్థానానికి కూడా అదే ఉప ఎన్నిక జరుగుతుందని ఈసీ ప్రకటించింది.