కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి విభాగంలా మారింది: మెహబూబా ముఫ్తీ
Mehbooba Mufti |
జమ్ము: బీజేపీ పాలనతో జమ్ముకశ్మీర్‌లో ప్రతిదీ ధ్వంసమైందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు. జమ్ములో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తాము తిరిగి అక్కడికి వెళ్తామని కశ్మీరీ పండిట్లు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం వారి సంపాదనను, రేషన్‌ను నిలిపివేస్తున్నదని ముఫ్తీ ఆరోపించారు. కశ్మీరీ పండిట్ల సంఘర్షణను బీజేపీ ఓట్ల కోసం వాడుకుంటున్నదని మండిపడ్డారు.
అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కూడా ముఫ్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి చెందిన ఒక విభాగంగా మారిపోయిందని ఆరోపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలవేళ బీజేపీ మతం పేరుతో ప్రచారం చేస్తుంటే.. కేంద్ర ఎన్నికల సంఘం ఏమీ తెలియనట్లుగా మౌనంగా ఉన్నదని విమర్శించారు.
ఈసీని ఇలాగే వాడుకుంటే దాని స్వయంప్రతిపత్తి ఎంతో కాలం నిలువదని చెప్పారు. బీజేపీ ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నదని ముఫ్తీ మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

