న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మారింది. ముందు ప్రకటించిన విధంగా ఈ ఏడాది అక్టోబర్ 1న కాకుండా అదే నెల 5న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. అక్టోబర్ 2న బిష్ణోయ్ సామాజిక వర్గ శతాబ్దాల నాటి పండుగను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీని మార్చినట్టు తెలిపింది.
దీంతో గతంలో ప్రకటించిన విధంగా జమ్ము-కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న కాకుండా అక్టోబర్ 8న జరుపుతామని ఈసీ వెల్లడించింది. అఖిల భారత బిష్ణోయ్ మహాసభ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల తేదీని మార్చినట్టు ఈసీ తెలిపింది.