Kerala High Court | ఫిరాయింపు నేతలు ప్రజాతీర్పు కోరాల్సిందే: కేరళ హైకోర్టు
పార్టీ ఫిరాయింపుదార్లకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజాతీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని పేర్కొంది.
- ఓటర్ల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించరాదు
- తన పార్టీకి వ్యతిరేకంగా వైఖరిని మార్చుకోరాదు
- సంచలన తీర్పు వెలువరించిన కేరళ హైకోర్టు
Kerala High Court | కొచ్చి, ఫిబ్రవరి 9: పార్టీ ఫిరాయింపుదార్లకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజాతీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని పేర్కొంది. ఓ రాజకీయ పార్టీ లేదా రాజకీయ కూటమి నుండి ఎన్నికైన అభ్యర్థి ఆ పార్టీ లేదా కూటమికి వ్యతిరేకంగా తన వైఖరిని మార్చుకోకూడదని స్పష్టం చేసింది. తన పార్టీకి విరుద్ధంగా వ్యవహరించాలనుకుంటే ఆ అభ్యర్థి మరోసారి ప్రజాతీర్పును కోరాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇడుక్కి జిల్లాలోని ఆదిమాలి గ్రామ పంచాయతీకి చెందిన పార్టీ ఫిరాయింపు కేసులో జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ నెల 5న ఈ తీర్పును వెలువరించారు.
ఓ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజల గొంతుకగా ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ ప్రజాప్రతినిధి ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా, తన ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని అన్నారు. ‘ఓ రాజకీయ పార్టీ లేదా కూటమి నుంచి ఎన్నికైన ప్రతినిధి తన పదవీకాలం పూర్తయ్యేవరకు ఆ పార్టీని లేదా కూటమిని విడిచిపెట్టకూడదు. ఓ రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఉన్నందునే వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి.. ఆ అభ్యర్థి తన ఇష్టానుసారంగా వ్యవహరించకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగా ఎన్నికైతే.. ఆ అభ్యర్థి ప్రజల అభీష్టం ప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు. ఓ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన వారు ఆయా మండళ్లు లేదా సంస్థలు, సభల్లో తమను ఎన్నుకున్న ప్రజల ఉద్దేశాలను వెల్లడించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆంగ్ల క్యాథలిక్ చరిత్రకారుడు, రాజకీయవేత్త, రచయిత లార్డ్ యాక్టన్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ.. ‘అధికారం అవినీతికి పాల్పడేలా చేస్తుంది.. సంపూర్ణ అధికారం అవినీతిలో పూర్తిగా ముంచేస్తుంది’ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ మాటలను గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎన్నికైన సభ్యుడు మరోసారి ఓటర్ల తీర్పు కోరేంత వరకు తనను ఎన్నుకున్న ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరచాలన్నది ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశమని గుర్తు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

