న్యూఢిల్లీ : వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని ఆ పెద్దాయన ప్రూవ్ చేశాడు. షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్‌లు నటించిన దిల్‌తో పాగల్ హై మూవీ నుంచి కోయి లడ్కీ హై సాంగ్‌కు విజయ్ ఖరోటె అనే వృద్ధుడు క్రేజీ స్టెప్స్‌తో అదరగొట్టాడు. కంటెంట్ క్రియేటర్ ఖరోటె తరచూ ఈ తరహా వీడియోలను (Viral video)ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తుంటారు.
గత వారం పోస్ట్ చేసిన వీ వీడియోకు 60 లక్షల వ్యూస్ రాబట్టింది. షారుక్, మాధురీ దీక్షిత్‌లపై తెరకెక్కించిన ఈ సాంగ్‌కు పెద్దాయన పెర్ఫామ్ చేస్తూ ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఆయన స్టైలిష్ మూమెంట్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
గ్రాండ్‌పా…ఇలాగే నవ్వుతూ ముందుకెళ్లు..మిమ్మల్ని చూసిన తర్వాత మా తాత గుర్తుకువచ్చారని ఓ యూజర్ కామెంట్ చేశారు. మనసు యవ్వనంలా ఉండాలి…మీరు మీలోనే సంతోషం వెతుకున్నారు…నైస్ జాబ్ అంకుల్ అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Abhishek Bachchan | రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. త్వరలో సమాజ్‌వాది పార్టీలో చేరిక..!