ముంబై: బాలీవుడ్ యువ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆయన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీలో చేరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయాగ్ రాజ్ లోక్సభ స్థానం నుంచి అభిషేక్ బచ్చన్ బరిలో దిగే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతున్నది.
అయితే, ఈ వార్తలపై సమాజ్వాది పార్టీ స్పందించింది. అభిషేక్ బచ్చన్ తమ పార్టీలో చేరతాడంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టి పుకారేనని ఆ పార్టీ వర్గాలు ఖండించాయి. కాగా, అభిషేక్ బచ్చన్ 2013లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు రాజకీయాల్లోనే ఉన్నారని, నేను రాజకీయాల్లోకి రానని చెప్పాడు.