Mowgli Girl | మౌగ్లీ గర్ల్ ఎహసాస్ మృతి.. అనారోగ్యంతో కన్నుమూత
Mowgli Girl | ఇండియా మౌగ్లీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఎహసాస్ (18) కన్నుమూసింది. 2017లో కటార్నియా ఘాట్ ఫారెస్ట్ ఏరియాలో రోడ్డు పక్కన ఆమె మొదటిసారి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకుంటే ఆ సమయానికి ఆమె మానవులతో సంబంధం లేకుండా జీవిస్తున్నది.
Mowgli Girl |లక్నో, జూన్ 19: ఇండియా మౌగ్లీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఎహసాస్ (18) కన్నుమూసింది. 2017లో కటార్నియా ఘాట్ ఫారెస్ట్ ఏరియాలో రోడ్డు పక్కన ఆమె మొదటిసారి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకుంటే ఆ సమయానికి ఆమె మానవులతో సంబంధం లేకుండా జీవిస్తున్నది. రెండు చేతులు, రెండు కాళ్లపై నడిచేది. బట్టలు వేసుకోడానికి ఇష్టపడేది కాదు. మనుషులతో దూకుడుగా ప్రవర్తించేది. దాంతో ఆమెను ది జంగిల్ బుక్‌లోని మౌగ్లీ గర్ల్‌తో పోల్చారు. అప్పటి నుంచే ఆమె మౌగ్లీ గర్ల్‌గా ఫేమస్ అయింది.
ఆమెను మొదట శిశుసంక్షేమ శాఖ అధికారులు తీసుకెళ్లి పూజ అని పేరు పెట్టారు. ఆ తర్వాత నిర్వాన్ గవర్నమెంట్ స్కూల్లో చేర్చాక ఆమె పేరును ఎహసాస్గా మార్చారు. అయితే కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నది. రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్లో చికిత్స చేయగా.. ఆమెకు తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్తో పాటు ఊపిరితిత్తుల వ్యాధి సోకినట్టు గుర్తించారు. ఇటీవల అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో తిరిగి హాస్పిటల్లో చేర్పించగా.. జూన్ 15న చనిపోయిందని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ehsas
- India
- Mowgli Girl
- passed away
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

