న్యూఢిల్లీ: ఆహారంలో గుడ్లు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం స్పందించింది. మన దేశంలో అందుబాటులో ఉన్న గుడ్లు సురక్షితమైనవేనని ప్రకటించింది. వీటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తెలిపే శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. పౌల్ట్రీలలో నైట్రో ఫ్యూరాన్ల వాడకంపై పూర్తి నిషేధం అమలవుతున్నదని వివరించింది.