దౌసా: భారత్లోని హైవేలు, రహదారులను అమెరికాతో సమానంగా నిర్మించేందుకు కృషిచేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 2024 చివరినాటికి దేశంలోని రహదారుల నిర్మాణ సదుపాయాలను అమెరికా స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు.
ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే ప్రారంభం సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా ఈ ఎక్స్ప్రెస్వేను వెనుకబడిన ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్నామని చెప్పారు.