Pregnant |న్యూఢిల్లీ: గర్భిణులు జంక్‌ఫుడ్ తింటే పుట్టబోయే పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) తీసుకున్న గర్భిణులకు పుట్టిన శిశువుల తల పరిమాణం, తొడ ఎముక సైజు అసాధారణంగా పెరిగినట్టు అధ్యయనంలో వెల్లడైంది.
బ్రెజిల్లో 417 మంది తల్లుల ఆహార విధానాలు, పిల్లలపై దాని ప్రభావంపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ అధ్యయన ఫలితాలు ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో ప్రచురితమయ్యాయి. జంక్‌ఫుడ్ తిన్న గర్భిణుల్లో పిండం అస్థిపంజర భాగాలపై ప్రతికూల ప్రభావం పడినట్టు అధ్యయనకారులు గుర్తించారు.