చెన్నై: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి వ్యతిరేకంగా మంగళవారం చెన్నైలో పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు డీఎంకే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్ఈపీని అంగీకరించే వరకు తమిళనాడు విద్యా శాఖకు నిధులు ఇవ్వబోమని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ర్టానికి నిధుల కేటాయింపులో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.
యూజీసీ ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడింది. ఎన్ఈపీ అమలుకు కట్టుబడి ఉన్నాం ఎన్ఈపీని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఎన్ఈపీ హిందీని కానీ, వేరొక భాషను కానీ విద్యార్థులపై రుద్దబోదన్నారు.