10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : ఈపీఎస్
పది మంది డీఎంకే ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఈకే పళనిస్వామి (ఈపీఎస్) పేర్కొన్నారు.
చెన్నై : పది మంది డీఎంకే ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఈకే పళనిస్వామి (ఈపీఎస్) పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు డీఎంకేలో చేరతారనే వార్తల గురించి ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని, పది మంది డీఎంకే ఎమ్మెల్యేలే తన వర్గంతో టచ్‌లో ఉన్నారని ఆయన అన్నారు.
డీఎంకే కుటుంబ పార్టీ, కార్పొరేట్ పార్టీ అని ఈపీఎస్ ఆరోపించారు. ఆ పార్టీలో గౌరవం ఆశించకూడదని అది ఓ కార్పొరేట్ కంపెనీ అని వ్యాఖ్యానించారు. ఉదయనిధి స్టాలిన్ కేవలం ఓ ఎమ్మెల్యే అని ఆయనకు ఎలాంటి పదవి లేకపోయినా నగర మేయర్‌ను పక్కనపెట్టి ఓ పధకాన్ని ప్రారంభించారని అన్నారు. శశికళ, టీటీవీ దినకరన్‌లు పార్టీలో చేరాలని పార్టీ శ్రేణులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఏఐఏడీఎంకే విస్తృతస్ధాయి సమావేశంలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపధ్యంలో సీబీసీఐడీ అధికారులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఆదేశాలతోనే దర్యాప్తు చేపట్టారని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి నిర్లక్ష్యంగా తయారైందని ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఈపీఎస్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

