న్యూఢిల్లీ : సైబర్ మోసాలు, మనీలాండరింగ్ కేసులో సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై దాడి జరిగింది.
ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలోని చార్టర్డ్ అకౌంటెంట్ అశోక్ కుమార్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో గురువారం ఈ దారుణం జరిగినట్లు ఈడీ అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొందరు సీఏలు, క్రిప్టో ట్రేడర్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు.