Pinarayi Vijayan | మాజీ సీఎం పినరయి విజయన్ కూతురుకు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు
Pinarayi Vijayan : కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షాకిచ్చింది. ఆయన కూతురు టీ వీణాకు మనీ లాండరింగ్ కేసులో సమన్లు జారీ చేసింది. సీఎంఆర్ఎల్ అనే మైనింగ్ కంపెనీతోపాటు ఆమె ఐటీ కంపెనీకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ నోటీసులు ఇచ్చింది.
Pinarayi Vijayan : కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షాకిచ్చింది. ఆయన కూతురు టీ వీణాకు మనీ లాండరింగ్ కేసులో సమన్లు జారీ చేసింది. సీఎంఆర్ఎల్ అనే మైనింగ్ కంపెనీతోపాటు ఆమె ఐటీ కంపెనీకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 29న వీణా తమ ఎదుగ వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. వీణాకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది రెండోసారి. గతంలోనే ఒకసారి నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది.
ఈ నెల 17న ఆమెను కోచిలోని ఈడీ ఆఫీసులో అధికారులు విచారించారు. దాదాపు తొమ్మిది గంటలకుపైగా ఆమెను విచారించారు. ఆమెపై పీఎంఎల్ఏ యాక్ట్ కింద నమోదైన కేసుపై ఈ విచారణ సాగుతోంది. జూన్ 19న ఈడీ అధికారులు తిరువనంతపురంలోని ఆమె బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన విచారణలో ఆమె ఇచ్చిన వాంగ్మూలం, బ్యాంకు లాకర్ల తనిఖీల తర్వాత మరింత విచారణ అవసరమని ఈడీ అధికారులు భావించారు. అందుకే ఆమెకు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ నెల 29న మరోసారి తమ ఎదుట హాజరు కావాలని వీణకు సూచించారు. ఈ కేసులో మరో నలుగురికి కూడా అధికారులు ఇప్పటివరకు విచారించారు.
సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి వీణకు చెందిన ఐటీ సంస్థకు రూ.2.87 కోట్లు బదిలీ అయ్యాయని ఈడీ గుర్తించింది. ఏ సేవలు అందించకుండానే వీణ సంస్థకు చెల్లింపులు జరిగాయి. అలాగే, ఇతర లోన్లకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో వీటిని ఈడీ విచారిస్తోంది. మరోవైపు పినరయి కూతురును ఈడీ విచారించడంపై కేరళలో ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి కేంద్రంపై విమర్శలు చేస్తోంది. రాజకీయంగా వేధించేందుకే ఈ విచారణ అని విమర్శిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

