న్యూఢిల్లీ: కర్నాటకలోని బల్లారి జిల్లాలో ఇవాళ ఈడీ సోదాలు జరిగాయి. వాల్మీకీ స్కామ్(Valmiki Scam)తో లింకున్న కేసులో తనిఖీలు చేపట్టారు. బల్లారీ ఎంపీ ఈ. తుకారాం, బల్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేశ్, బల్లారి రూరల్ ఎమ్మెల్యే బీ నాగేంద్ర సన్నిహితుడు గోవర్దన్ రెడ్డి ఇండ్లల్లో ఈడీ సోదాలు చేపట్టింది. కర్నాటక మహార్షి వాల్మీకీ ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్ల నుంచి కోట్ల నిధులను అక్రమ రీతిలో ఫేక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కర్నాటక పోలీసులు, సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీ ల్యాండరింగ్ కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. వాల్మీకి ఎస్టీ కార్పొరేషన్‌ను 2006లో ప్రారంభించారు. ఎస్టీ వర్గీయులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. వాల్మీకి నిధుల్ని బెల్లారీ నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికల కోసం వాడుకున్నట్లు ఈడీ ఆరోపణ చేసింది.
Also Read..