న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికార పార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు (Raids) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 4న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్‌ను (Sanjay Singh) అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగా పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ (Amanatullah Khan) ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ (Delhi Waqf Board) చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నియామకాలకు (Illegal Appointments) సంబంధించి సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. మనీ లాండరింగ్‌కు (Money Laundering) పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నది.
ఓఖ్లా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన అమానతుల్లా ఖాన్.. గతంలో ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
#WATCH | Delhi: ED raids underway at the premises of AAP MLA Amanatullah Khan in connection with a money laundering case. pic.twitter.com/KD0EaQOdjn
— ANI (@ANI) October 10, 2023