న్యూఢిల్లీ : అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులకు సంబంధించిన పారాబొలిక్ డ్రగ్స్ కంపెనీ కేసులో శుక్రవారం ఈడీ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.
పారాబొలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా రూ.1600 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడ్డారని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. దీనిపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ఈ కేసుకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.