కోల్కతా : కోల్కతా పోలీస్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ శంతన్ సిన్హా బిశ్వాస్ ఇంటిపై ఈడీ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. ఆయనతోపాటు మరికొందరి ఆస్తులపైనా కూడా ఈడీ దాడులు చేశారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్టు అధికారులు చెప్పారు.
స్థానిక నేరగాడు విశ్వజిత్ పొద్దార్ కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు జరినట్టు తెలిసింది. ఈడీ తనిఖీల్లో రూ.1.47 కోట్ల నగదు, రూ.67.64 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.