తిరువనంతపురం, అక్టోబర్ 8: మలయాళ సినీ నటులు మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్, మరో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇండ్లు, కార్యాలయాల్లో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ రాకెట్‌కు సంబంధించి కేరళ, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. తన లాండ్ రోవర్ డిఫెండర్ కారును కస్టమ్స్ అధికారులు సీజ్ చేయడాన్ని దుల్కర్ సల్మాన్ కేరళ హైకోర్టులో బుధవారం సవాల్ చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కస్టమ్స్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కస్టమ్స్ వద్ద ఉన్న ఆధారాల బలమేంటని ప్రశ్నించింది. కాగా కస్టమ్స్ అధికారులు తన కారును సీజ్ చేయడాన్ని సవాల్ చేసిన మరుసటి రోజే దుల్కర్ సల్మాన్, ఆయన తండ్రి మమ్ముట్టి ఇండ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.