న్యూఢిల్లీ: హర్యానా భూ లావాదేవీలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను ఈడీ మంగళవారం ఐదుగంటలకు పైగా ప్రశ్నించి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. బుధవారం మరోసారి విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది.
హర్యానాలోని షికోపూర్లో భూ లావాదేవీలతో ముడిపడిన కేసులో వాద్రాపై దర్యాప్తు జరుగుతోంది. 3.5 ఎకరాల భూమిని వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.7.5 కోట్లకు కొని డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించింది. ఈ లావాదేవీలపై కేసు నమోదైంది.