e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, November 30, 2021
Home News Abhishek Banerjee : ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ మూడో సమన్లు జారీ

Abhishek Banerjee : ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ మూడో సమన్లు జారీ

న్యూఢిల్లీ : టీఎంసీ పార్లమెంట్‌ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి (Abhishek Banerjee) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21 న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లలో పేర్కొన్నది. ఇంతకుముందు సోమవారం నాడు అభిషేక్ బెనర్జీని ఈడీ ప్రశ్నించింది. అభిషేక్‌కు సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. బొగ్గు అక్రమ రవాణా కేసులో ఈడీ దర్యాప్తు జరుపుతున్నది.

బుధవారం నాడు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ.. అభిషేక్‌ బెనర్జీ హాజరుకాలేదు. దాంతో ఈ నెల 21 న హాజరుకావాలని మరోసారి సమన్లు ఇచ్చింది. త్వరలో అభిషేక్ బెనర్జీ భార్య రుజిరాను ప్రశ్నించడానికి కూడా ఈడీ సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. అభిషేక్ బెనర్జీని ఈడీ అధికారులు సోమవారం నాడు ఎనిమిది గంటలకు పైగా విచారించారు. కుటుంబసభ్యులతో సంబంధమున్న రెండు సంస్థలు అందుకున్న లెక్కకు మించిన డబ్బు గురించి ప్రత్యేకంగా ప్రశ్నించారు. ఎక్కడి నుంచి ఆదాయం వచ్చిందో వివరించడంలో అభిషేక్‌ బెనర్జీ విఫలమైనట్లు తెలుస్తున్నది.

- Advertisement -

ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడైన టీఎంసీ యువనేత వినయ్ మిశ్రాతో అనుబంధం గురించి అభిషేక్ బెనర్జీని సోమవారం ప్రశ్నించినట్లు సమాచారం. బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన నగదు విషయంలో వినయ్ మిశ్రా కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంటున్నది. అయితే, వినయ్ మిశ్రా నేరం, ఆయనతో ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేదని చెప్పినట్లు తెలుస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనూప్ మాఝీ, పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ మిశ్రాకు సంబంధించి అభిషేక్ బెనర్జీని కూడా ఈడీ ప్రశ్నించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

కర్నల్‌ లాఠీఛార్జీపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశం

18 ఏండ్లలో తొలిసారి 1000 మి.మీ వర్షపాతం

తీవ్రవాదంపై యుద్ధానికి రూ.585 లక్షల కోట్లు ఖర్చు

ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి

బెంగళూరులో ‘అప్పికో ఉద్యమం’.. ఎందుకంటే?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement