న్యూఢిల్లీ, జనవరి 31: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీఎం కేజ్రీవాల్‌కు తాజాగా మరోమారు సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు జారీకావటం ఇది 5వ సారి. గత నాలుగు నెలలుగా ఈడీ నుంచి వస్తున్న సమన్లను వివిధ కారణాలు చూపుతూ సీఎం కేజ్రీవాల్ వాటిని తిరస్కరిస్తున్నారు.
2023లో నవంబర్ 2, డిసెంబర్ 21న, ఈ ఏడాదిలో జనవరి 3, 18న సమన్లు జారీ అయ్యాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి చార్జ్‌షీట్‌లో సీఎం కేజ్రీవాల్ పేరును ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నాయకులు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, పలువురు వ్యాపారవేత్తల్ని ఈడీ అరెస్టు చేసింది. తమ నాయకుడికి సమన్లు జారీ కావటంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పందించింది. సమన్లను తమ లీగల్ టీమ్ పరిశీలిస్తున్నదని ఆప్ తెలిపింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నది.