న్యూఢిల్లీ, జనవరి 15: కొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు అనుమతి ఇస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి గత ఏడాది మార్చిలో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న కేజ్రీవాల్ ఫిబ్రవరి 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు.