Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )కు భారీ షాక్ తగిలింది.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi liquor policy case)లో కేజ్రీని విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Lt Governor VK Saxena) అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో డిసెంబర్ 5న మాజీ సీఎంను విచారిచేందుకు ఈడీ అనుమతి కోరగా.. అందుకు ఎల్జీ తాజాగా పర్మిషన్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసినట్లు సదరు వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10 నుంచి జూన్ 1 వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. జూన్ 2న ఆయన మళ్లీ జైలులో లొంగిపోగా, జూన్ 20న ట్రయల్ కోర్టులో బెయిల్ దక్కింది. బెయిల్‌ను ఈడీ సవాల్ చేయడంతో జూన్ 25న హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. జూన్ 26న ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. జూలై 12న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సీబీఐ అప్పటికే అరెస్టు చేయడం వల్ల ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఇక సెప్టెంబర్ 13న సీబీఐ కేసులోనూ కేజ్రీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ దక్కడంతో ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆయన చివరికి సెప్టెంబర్ 14వ తేదీన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులోనే ఈడీ మరోసారి కేజ్రీవాల్‌ను విచారించేందుకు సిద్దమవుతోంది.
Also Read..
Virat Kohli | కోహ్లీ వన్ 8 కమ్యూన్ పబ్‌కు నోటీసులు.. 7 రోజుల్లో స్పందన లేకపోతే చట్టపరమైన చర్యలు
Mahakaleshwar Temple | ఉజ్జయిని మహాకాలేశ్వర ఆలయంలో విషాదం.. దుపట్టా మెడకు బిగుసుకుని మహిళ మృతి
Kavach | దట్టమైన పొగమంచులోనూ.. కవచ్ పనితీరు ఇలా.. VIDEO