చెన్నై: చెట్టినాడ్ గ్రూపు(Chettinad Group) ఆఫీసుల్లో రెండో రోజు కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మనీల్యాండరింగ్ చట్టం కింద ఆ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు తిరుచ్చి, ఇతర నగరాల్లో ఉన్న చెట్టినాడ్ ఆఫీసుల్లో ఈడీ అధికారులు సెర్చ్ చేస్తున్నారు. రెండో రోజు ఎగ్మోర్ ఏరియాలో ఉన్న ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి.
చెట్టినాడ్ గ్రూపు వందేళ్ల వ్యాపార సంస్థ. అనేక రంగాల్లో ఆ సంస్థ వ్యాపారాలు ఉన్నాయి. సిమెంట్ ఉత్పత్తి, లాజిస్టిక్స్, నిర్మాణ రంగాల్లో ఆ కంపెనీ ఉంది. డిసెంబర్ 2020లో ఆ కంపెనీపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. దాదాపు 700 కోట్ల మేర ఆ కంపెనీ పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.