న్యూఢిల్లీ, నవంబర్ 15: చైనాకు రూ.44 కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సయిల్పైన, ఆయన కంపెనీపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఉత్తర కన్నడలోని కర్వార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 59 ఏళ్ల సయిల్, ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న శ్రీ మల్లికార్జున్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను చార్జిషీట్లో నిందితులుగా పేర్కొన్నట్లు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. సయిల్ని సెప్టెంబర్లో ఈడీ అరెస్టు చేసింది.