న్యూఢిల్లీ: అక్రమంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడిన కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) కేసీ వీరేంద్ర పప్పీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. చిత్రదుర్గ్ నియోజకవర్గానికి చెందిన పప్పీని.. సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. ఈ కేసును దర్యాప్తు చేస్ఉతన్న అధికారులు ట్రాన్సిట్ రిమాండ్ తీసుకున్నారు. త్వరలో అతన్ని బెంగుళూరు తీసుకురానున్నారు.
గోవాలో పప్పీకి చెందిన క్యాసినో గోల్డ్, ఓసియన్ రివర్స్ క్యాసినో, పప్సీ క్యాసినో ప్రైడ్, ఓసియన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినోలపై తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో సుమారు 12 కోట్ల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఓ కోటి విదేశీ కరెన్సీ కూడా ఉన్నది. అమెరికా డాలర్లు, బ్రిటీష్ పౌండ్లు, దిర్హమ్లు, యూరో కరెన్సీ ఉంటుంది.
నిందితుడు పప్పీ.. పలు రకాల ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను నడుపుతున్నట్లు తెలిసింది. వాటిల్లో కింగ్ 567, రాజా 567 లాంటి సైట్లు ఉన్నాయి. నగదుతో పాటు ఆరు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నది. 10 కిలోల వెండిని సీజ్ చేశారు. మనీల్యాండరింగ్ చట్టం ప్రకారం నాలుగు వాహనాలను సీజ్ చేశారు.
17 బ్యాంకు అకౌంట్లను, రెండు బ్యాంకు లాకర్లను సీజ్ చేశారు. సోదరురుడు కేసీ నాగరాజ్ ఇంటి నుంచి డాక్యుమెంట్లు సేకరించారు.