న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసు(Money Laundering Case)లో జేపీ ఇన్ఫ్రాటెక్ ఎండీ మనోజ్ గౌర్‌ను ఇవాళ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ సంస్థకు గతంలో మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్, సీఈవోగా చేశారాయన. జేపీ ఇన్ఫ్రాటెక్ సంస్థకు మాజీ చైర్మెన్, ఎండీగా కూడా చేశారు. ఢిల్లీ, యూపీకి చెందిన ఆర్థిక నేర శాఖ దాఖలు చేసిన కేసు ఆధారంగా జేపీ గ్రూపుపై ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నది. జేపీ విష్‌టౌన్, జేపీ గ్రీన్స్ ప్రాజెక్ట్స్ వద్ద ఇండ్లు ఖరీదు చేసిన వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ విచారణ కొనసాగిస్తున్నది. ఆ కంపెనీ చీటింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సుమారు 12 వేల కోట్ల మేర మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పీఎంఎల్ఏ చట్ట కింద గౌర్‌ను అరెస్టు చేశారు. ఇండ్లు ఖరీదు చేసిన వారి డబ్బులను దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. ఆ నిధులను దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మన SLBC టన్నెల్ నిర్మాణ పనులను కూడా ఈ కంపెనీకే అప్పగించింది మన ప్రభుత్వం.