న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నలుగురిని అరెస్ట్ చేసింది. లావా ఇంటర్నేషనల్ కంపెనీ ఎమ్డీ హరిఓం రాయ్, చైనా జాతీయుడు గ్వాంగ్వెన్ క్యాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ గార్గ్, రాజన్ మాలిక్ అరెస్టయినట్లు విశ్వసనీయ సమాచారం. భారత దేశంలో పన్నులను ఎగ్గొట్టడం కోసం వివో రూ.62,476 కోట్లను చైనాకు చట్టవిరుద్ధంగా పంపినట్లు ఈడీ వెల్లడించింది.