Tejashwi Yadav | బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కుంభకోణంలో విచారణకు రావాలని నోటీసులు ఆదేశించింది. జనవరి 5న హాజరు కావాలని కోరింది. మరో వైపు విదేశాలకు వెళ్లాలని ఉందంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్లేందుకు ఉ ముఖ్యమంత్రి కోర్టును ఆశ్రయించారు. ఇంతకు ముందు ఇదే కేసులో ఈ నెల 27న మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇంతకు ముందు తేజస్వీ యాదవ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినా ఆయన హాజరుకాలేదు. ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతికి ఈ కేసులో ఉపశమనం లభించింది. ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. 2004లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే బోర్డు ఐఆర్సీటీసీకి రైల్వే క్యాటరింగ్, రైల్వే హోటల్స్ సేవలను అప్పగించింది. రాంచీ, పూరీకి చెందిన హోటల్స్ నిర్వహణ, అభివృద్ధి కోసం జారీ చేసిన టెండర్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. టెండర్ దక్కించుకున్న హోటల్ యాజమాన్యం లాలూ కుటుంబానికి పాట్నాలో మూడెకరాల భూమిని ఇచ్చినట్లు ఆరోపణలు ఉండగా.. ఈ కేసులో లాలూ రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్ సహా పలువురిని నిందితులుగా చేర్చారు.