న్యూఢిల్లీ: బెంగాల్ సీఎం మమతపై హైకోర్టు మాజీ జడ్జి, బీజేపీ లోక్సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీ శుక్రవారం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నోటీసులు అందుకున్న వారిలో గంగోపాధ్యాయ నాలుగో వారు. ఈ నెల 15న ఓ బహిరంగ సభలో గంగోపాధ్యాయ.. మమతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి టీఎంసీ ఫిర్యాదు చేసింది.