న్యూఢిల్లీ, జూలై 31 : జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 17వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని రిటర్నింగ్ అధికారిగా, మరో ఇద్దరు అధికారులను అదనపు రిటర్నింగ్ అధికారులుగా ఈసీ ఇప్పటికే ప్రకటించింది.
ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 782 మంది ఓటర్లుగా ఉండే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల జాబితాను గురువారానికి సిద్ధం చేశామని తెలిపింది.