ఇద్దరు ఈఆర్వోలపై సస్పెన్షన్ వేటు
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకొన్నాయన్న ఆరోపణల విషయంలో ఇద్దరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను(ఈఆర్వో) సస్పెండ్ చేయాలని భారత ఎన్నికల సంఘం యూపీ ముఖ్య ఎన్నికల అధికారిని గత నెల 31న ఆదేశించింది. ఇద్దరు ఈఆర్వోలతో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్లో మరింత కఠినమైన సెక్షన్లను జోడించాలని కోరింది.
- పిలిభిత్ ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఈసీ చర్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకొన్నాయన్న ఆరోపణల విషయంలో ఇద్దరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను(ఈఆర్వో) సస్పెండ్ చేయాలని భారత ఎన్నికల సంఘం యూపీ ముఖ్య ఎన్నికల అధికారిని గత నెల 31న ఆదేశించింది. ఇద్దరు ఈఆర్వోలతో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్లో మరింత కఠినమైన సెక్షన్లను జోడించాలని కోరింది. డీఈవోలు, ఈఆర్వోలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాలను పునఃసమీక్ష చేయాలని ఆదేశించింది. ఫామ్ 6, 7 లేదా 8లో చేర్పులు, తొలగింపులను ప్రత్యేకంగా పరిశీలించాలని కోరింది. పిలిభిత్ నియోజకవర్గంలో ‘సర్’ ముగిసిన తర్వాత వేలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి వారి స్థానంలో నకిలీ వ్యక్తుల పేర్లను పొందుపరిచారని ఆరోపణలు వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

