Abhijit Gangopadhyay | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అభ్యర్థి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయపై చర్యలు చేపట్టింది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి 24 గంటల పాటు ఆయన ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ప్రచారంలో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
తమ్లుక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గంగోపాధ్యాయ పోటీ చేస్తున్నారు. అయితే, ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆయన బీజేపీ సందేశ్‌ఖాలీ అభ్యర్థి రేఖా పాత్రని రూ.2వేలకు కొనుగోలు చేశారని తృణమూల్ కాంగ్రెస్ చెబుతోందన్న ఆయన.. మరి సీఎం మమత బెనర్జీ ఎంతకు అమ్మడుపోతున్నారు..? మీ రేటు రూ.10లక్షలా ? అంటూ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వ్యాఖ్యలపై టీఎంసీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచేలా ఉన్నాయని.. కాషాయ పార్టీ నేతలు హద్దుమీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈ నెల 20న ఆయనకు షాకోజ్ నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం.. తాజాగా ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.