న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 10.02 గంటలకు మణిపూర్‌లోని మోయిరాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. మోయిరంగ్కు 100 కిలోమీటర్ల దూరంలో భూ కంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 110 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
An earthquake of magnitude 4.5 occurred 100km SE of Moirang, Manipur at around 10:02am. The depth of the earthquake was 110 km below the ground: National Center for Seismology pic.twitter.com/UBykj2zEn7
— ANI (@ANI) September 23, 2022