Earthquake | అండమాన్‌ను వణికిస్తున్న భూకంపాలు
Earthquake | అండమాన్ అండ్ నికోబార్ దీవులను భూకంపాలు వణికిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో వరుసగా భూకంపాలు సంభవించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం 5.57 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో బలమైన ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.
భూకంపం అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 215 కిలోమీటర్ల దూరంలో ఉందని సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఆ తర్వాత ఉదయం 8.05 గంటలకు సైతం రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నుంచి మంగళవారం ఉదయం వరకు దాదాపు 11 సార్లు భూమి కంపించింది. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం అండమాన్ దీవుల్లో రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే దాదాపు 13సార్లు భూమి కంపించింది. వరుస భూకంపాలతో జనం భయాందోళనకు గురవుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

