న్యూఢిల్లీ : భూ మండలాన్ని భావి తరాల కోసం కాపాడాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్‌ను ఈ నెల 22న పాటిస్తున్నారు. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తదితర చోట్ల లైట్లు, విద్యుత్తు ఉపకరణాలను స్విచాఫ్ చేసి ఉంచుతారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్-ఇండియా పిలుపు మేరకు మన దేశంలో అనేక సంస్థలు, ప్రజలు భూమిని కాపాడుకోవడం కోసం ముందుకు వచ్చారు.