న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఇక నుంచి నామినీ సదుపాయం కోసం ఈపీఎఫ్ చందాదారులు నేరుగా దరఖాస్తు సమర్పించనక్కర్లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కొత్తగా ఈ-నామినేషన్ సేవల్ని ప్రారంభించింది. పోర్టల్‌లో ఆధార్ నంబర్ ద్వారా వేగంగా ఈ-నామినేషన్ పూర్తిచేయవచ్చని ఈపీఎఫ్‌వో ప్రకటన తెలిపింది. సెటిల్మెంట్ ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ సేవల్ని ప్రారంభించినట్లు ఈపీఎఫ్‌వో పేర్కొంది. సభ్యుడు మరణిస్తే నామినీ.. ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో పెన్షన్‌ను సులభంగా క్లెయిం చేసుకోవడానికి వీలు కానుంది.