Farmers protest: తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో పంజాబ్‌కు గ్యాస్, డీజిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైతుల నిరసన కారణంగా ఇవాళ ఇతర రోజుల్లో కంటే 50 శాతం తక్కువగా డీజిల్, ఇతర రోజుల్లో కంటే 20 శాతం తక్కువగా గ్యాస్‌ను సరఫరా చేయగలిగారని వెల్లడించాయి.
కాగా, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఇవాళ ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దాంతో భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు.
#WATCH | Haryana: Protesting farmers forcibly remove the cement barricade in Haryana’s Kurukshetra#FarmersProtest pic.twitter.com/qifYSpsHpv
— ANI (@ANI) February 13, 2024